33% మంది పనిమనుషులపై లైంగిక నేరాలు - MicTv.in - Telugu News
mictv telugu

33% మంది పనిమనుషులపై లైంగిక నేరాలు

October 17, 2018

మన దేశంలోనే అత్యాచారాలు జరగని ఊరు, వీధి లేకుండా పోతోంది.  మీటూ ఉద్యమమంటూ అంటూ కొంతమంది చదువుకున్న మహిళలు, ఉద్యోగినులు తమపై సాగిన దారుణాలను బయటికి వెల్లడిస్తున్నారు. అయితే చదువుకోని మహిళలు, బతుకు తెరువు కోసం చిన్నచితకా పనులు చేసే మహిళలపై, ఒంటరి మహిళలపై సాగుతున్న లైంగికనేరాలు వెలుగులోకి రావడం లేదు.

MeToo Movement Not Restricted To Urban Women, Domestic Workers Most Vulnerable To Harassment Surveys revealed shocking realities

మన దేశంలో పనిమనుషులపై సాగుతున్న లైంగిక దాడుల వివరాలు బయటికొచ్చాయి. మరాఠా ఫారెల్‌ ఫౌండేషన్‌, ఆక్స్‌ఫామ్, మన్నాడే ఎన్జీలోలు నిర్వహించిన సర్వేల ప్రకారం.. పని మనుషుల్లో 33 శాతం మంది పని లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అసంఘటిత రంగంలోని మహిళల్లో 29 శాతం కూలీలు, చిన్న తరహా పరిశ్రమల్లో 16 శాతం మంది కామాంధుల బారిన పడుతున్నారు. ఉన్న బతుకుతెరువు కూడా పోతుందనే బాధితులు ఎవరికీ ఫిర్యాదు చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీ మహిళపై పెద్ద సంఖ్యలో లైంగిక నేరాలు సాగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, దళితులే ఉంటున్నారు. కాగా, ఇళ్లలో పదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఆడపిల్లలపై పది శాతం అత్యాచారాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.