ఈ వయసులో మెట్రోలో ఇదేం పాడుబుద్ధి! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వయసులో మెట్రోలో ఇదేం పాడుబుద్ధి!

December 8, 2017

హైదరాబాద్ మెట్రో రైలు మొదలై గట్టిగా పది రోజులు కూడా గడవకముందే కీచకులు హల్‌చల్ చేస్తున్నారు. ప్రయాణికుడిగా నటిస్తూ అమ్మాయిల ఫొటోలు తీస్తున్న 65 ఏళ్ల వృద్ధ ప్రబుద్ధుడు అడ్డంగా బుక్ అయ్యాడు. అతణ్ని షీ టీమ్ పోలీసులు జైల్లో పడేశారు.ఉప్ప‌ల్-నాగోలు మ‌ధ్య‌లో షీటీమ్ నిర్వ‌హించిన డీకాయ్ ఆప‌రేష‌న్‌లో అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన ఎన్‌. న‌ర‌సింహ దొరికాడు. విద్యాశాఖలో పనిచేసి రిటైరైన అతడు తన సీటులో కూర్చుని ఎదురుగా కూర్చున్న అమ్మాయిలను ఫొటో తీస్తూ కనిపించాడు. షీ టీమ్ పోలీసులు ప్ర‌శ్నించగా తాను మెట్రో రైలు జర్నీ ఎంత బావుందో మిత్రులకు చెప్పడానికి వీడియో తీస్తున్నానని చెప్పుకొచ్చాడు. కానీ గట్టిగా బెదిరించి అడగ్గా అసలు సంగతి బయటపడింది. అతని ఫోన్లో అమ్మాయిల ఫొటోలు వందల కొద్దీ బయటపడ్డాయి. దీంతో నరసింహపై సెక్ష‌న్ 354 కింద అరెస్టు చేశారు.