Metro pillar falls on moving car in Delhi, 2 seriously injured
mictv telugu

Delhi : కదులుతున్న కారుపై పడిన మెట్రో పిల్లర్, ఇద్దరికి తీవ్ర గాయాలు..!!

February 17, 2023

Metro pillar falls on moving car in Delhi, 2 seriously injured

ఢిల్లీలోని హైదర్ పూర్ బద్లీలో గురువారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ గ్రిల్ కారుపై పడింది. దీంతో కారులోఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కదులుతున్న కారుపై గ్రిల్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుది. క్రేన్ సాయంతో గ్రిల్ ను తొలగించారు. రాత్రి 7గంటలకు ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. DMRC విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, క్షతగాత్రులకు అవసరమైన వైద్యసదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. హైదర్‌పూర్ బద్లీ వద్ద నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో, పిల్లర్ షట్టరింగ్ ముక్క పక్కనే ఆగి ఉన్న వాహనంపై పడింది. వాహనం లోపల ఉన్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి, అయితే అతన్ని రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపినట్లు అధికారులు తెలిపారు. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.