Metro rail chandramukhi and another two characters real strory
mictv telugu

‘మెట్రో చంద్రముఖి’ బండారం బయటపడింది…

January 25, 2023

Metro rail chandramukhi and another two characters real strory

మెట్రో రైల్లో ఓ యువతి చంద్రముఖి వేషం వేసి జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్‌లోని మనీ హీయిస్ట్, స్వైడ్ గేమ్ సిరీసుల్లో కనిపించే మరో రెండు పాత్రల వేషాలు కూడా రైల్లోకి దూసుకొచ్చి జనాన్ని భయపెట్టాయి. ఆ చంద్రముఖి పిచ్చిదని, బిచ్చెగత్తె అని, మిగతావాళ్లు కూడా అలాంటి బాపతేనని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని వాళ్ల ‘వికృత’ వేషాల వెనక పెద్ద బిజినెస్ ఉందని తెలిసింది.

 

 

View this post on Instagram

 

A post shared by boAt (@boat.nirvana)

ఇయిర్ ఫోన్స్, స్మార్ట్ వాచీలు వంటివాటిని తయారు చేసుకుని అమ్ముకునే బోట్ అనే సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ప్రచారం కోసం ఈ ఎత్తుగడ వేసింది. ఢిల్లీ మెట్రో అధికారుల అనుమతితోనే ఈ వీడియోలను షూట్ చేశారు. అయితే కొంత మార్ఫింగ్ చేశారని రైల్వే అధికారులు చెప్పారు. వాణిజ్య ప్రకటనలను షూట్ చేసుకోవడానికి నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తుంటామని, చంద్రముఖి వగైరాలకు కూడా అలాగే ఇచ్చామని తెలిపారు. ఈ వీడియోలను షార్ట్ క్లిప్పును బోట్ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. దీంతో మెట్రో ప్రయాణికులు ఆ చంద్రముఖి ఇక కనిపించదని ఊపిరిపీల్చుకున్నారు. కొందరైతే ఘోరంగా తిడుతున్నారు కూడా. దెయ్యంలా ఉన్న ఆ అమ్మాయి గుండెజబ్బు ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లి వుంటే వాళ్లు చచ్చిపోయేవాళ్లని తర్వాత ఆమె జైలుకెళ్లేదని అంటున్నారు.