ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో - MicTv.in - Telugu News
mictv telugu

ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో

September 22, 2022

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 25న మూడో టీ20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుకి సంబంధించి టిక్కెట్ల వ్యవహారంలో కొన్ని వివాదాస్పద ఘటనలు జరిగాయి. మ్యాచును నిర్వహించే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టిక్కెట్ల వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. జింఖానా గ్రౌండులో భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులతో తొక్కిసలాట జరిగింది. దీంతో క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్పించుకుని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను తీవ్రంగా మందలించారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్ సందర్భంగా హైద్రాబాద్ మెట్రో క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపు 10 గంటలు దాటనుండగా, ఆ మేరకు మెట్రో రైళ్ల సమయాన్ని పొడగించింది. ఆ రోజు రాత్రి 12.30 గంటల వరకు రైళ్లను నడపనున్నట్టు సంస్థ ఎన్వీఎస్ రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని పొడగిస్తామని కూడా ఆయన తెలిపారు.