కష్టకాలంలో కుక్కను వాడుకున్న తిండిపోతు..    - MicTv.in - Telugu News
mictv telugu

కష్టకాలంలో కుక్కను వాడుకున్న తిండిపోతు..   

March 25, 2020

Mexico Man craving for Cheetos amid coronavirus lockdown

మనదేశంలోనే కాదు, చాలా దేశాల్లోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మనిషి బయట కనిపిస్తే చాలు పోలీసులు కన్నెర్రజేస్తున్నారు. కానీ ‘తిట్టే నోరూ, తిరిగే కాలూ’ ఉరక ఉండవు కదా. అయినా సరే, రోగం సోకకుండా ఉండాలంటే కొంపలోనే పడుండాల్సిన పరిస్థితి. తిండి ప్రియులకు ఇది మరీ కష్టంగా మారుతోంది. 

మెక్సికోలో ఆంటోనియో మునోజ్ అనే ఓ తిండిప్రియుడు అలాగే బాధపడుతున్నాడు.అతనికి ‘చీతూస్‘ అనే వంటకం అంటే తెగ ఇష్టం. కానీ బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అందుకే సూపర్ ఐడియాతో కుక్కకు పని పురమాయించాడు. తన బుల్లి పెంపుడు కుక్క మెడకు చిట్టీ చుట్టాడు. ‘హలో, షాప్‌కీపర్. నా కుక్కకు చీతోస్ ఇవ్వు. ఎర్రది కాదు, ఆరెంజ్ రంగుది. దాని కాలర్‌కు 20 డాలర్లు ఉన్నాయి, తీసుకో’ అని రాశాడు. దారి మధ్యలో ఎవరైనా డబ్బులు కాజేస్తారనే అనుమానంతో..‘ హెచ్చరిక.. దీన్ని కెలికితే కరుస్తుంది..’ అని కూడా రాశాడు. 

సదరు కుక్కగారు పోలోమంటూ షాపుకు వెళ్లి, యజమాని కోరిన చీతూస్ పొట్లం పట్టుకొచ్చేసింది. అది షాపుకు వెళ్తున్న, తిండిని కొంపకు తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐడియా బాగానే ఉందిగానీ, ఆ కుక్క దారితప్పి మనకు తెలియని రోగం కూడా ఇంటికి తీసుకురావొచ్చు జాగ్రత్త అని కొందరు హెచ్చరిస్తున్నారు.