ప్రపంచంలోనే అతి పెద్ద బ్రెడ్ ఇది. 4.5 కిలోమీటర్లు 14,360 ముక్కలున్న బ్రెడ్లైన్ తయారు చేసి మెక్సికోలోని ఓ విశ్వవిద్యాలయ విద్యార్థులు గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఈ బ్రెడ్‌ను తయారూపొందించడానికి 700 మంది విద్యార్థులు 96 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. జనవరి 6న జరుపుకునే ‘త్రీ కింగ్స్ డే’ సందర్భంగా ఈ సంప్రదాయ రోస్కా డి రెయెస్ బ్రెడ్ ను విద్యార్థులు తయారు చేశారు. 500 కిలోల పిండి 26,000 కోడి గుడ్లు, 2,000 లీటర్ల పాలు, ఇతర పదార్థాలను ఈ అతి పెద్ద కేకు కోసం ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ఫోటులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫుడ్ విభాగంలో మెక్సికో ఎన్నో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు జాబితాలో ఈ బ్రెడ్ కూడా వచ్చి చేరింది. మెక్సికోలోని విద్యార్థులే కాకుండా రెస్టారెంట్లు హోటళ్లు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి.మెక్సికోలోని గ్వాడలజారాలోని కర్నే గారిబాల్డి అనే ప్రసిద్ధ రెస్టారెంట్, “రెప్పపాటులో” ఆర్డర్లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. నిజానికి, ఈ రెస్టారెంట్ 1996లో అత్యంత వేగవంతమైన సర్వీస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది.