అందుబాటులోకి మరో మెట్రో రూట్..7న ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

అందుబాటులోకి మరో మెట్రో రూట్..7న ప్రారంభం

February 4, 2020

metro

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండేళ్లు పూర్తిచేసుకుంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సాధించింది. మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాక హైదరాబాద్‌ ప్రజల ప్రయాణం సులభతరం అయింది. రోజు రోజుకూ మెట్రోరైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో రూట్‌లో మెట్రో రైలు సర్వీస్‌ ప్రారంభానికి సిద్దమైనది. 

ఈ నెల 7న ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైలు కారిడార్‌-3 రూట్ ప్రారంభం కానుంది. ఆరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ మెటో మార్గాన్ని ప్రారంభిస్తారు. ఈ మెట్రో మార్గం ఇప్పటికే ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందింది. ఈ రూట్ అందుబాటులోకి వస్తే మొత్తం 72 కి.మీ. నగరంలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది.