వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం.. రోగి కడుపులోనే కత్తెర   - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం.. రోగి కడుపులోనే కత్తెర  

October 15, 2020

hospital01

వరంగల్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరో సారి బయటపడింది. ఓ పేషంట్‌కు ఆపరేషన్ చేసిన తర్వాత అతడి కడుపులోనే దాన్ని మర్చిపోయారు. ఆ వ్యక్తికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది బయటపడకుండా గుట్టుగా ఆపరేషన్ చేసి తీసేందుకు ఏర్పాట్లు చేసినా అందరికి తెలిసిపోయింది. దీనిపై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బెల్లంపల్లిలోని శాంతిగనికి చెందిన రాజు కొన్ని రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో ఆపరేషన్ చేయించుకున్నారు.ఆ సమయంలో వైద్యులు కత్తెరను కడుపులోనే మర్చిపోయారు. కొన్ని రోజులకు అతడికి కడుపునొప్పి రావడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడే ఈ విషయం బయటపడింది. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.