MGM superintendent Chandrasekhar suspended senior medical student Saif from the hospital.
mictv telugu

వైద్య విద్యార్థి సైఫ్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం

February 25, 2023

MGM superintendent Chandrasekhar suspended senior medical student Saif from the hospital.

వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ.. అరెస్టయిన ఎంజీఎం సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను ఆస్పత్రి నుంచి సస్పెండ్ చేశారు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్. ప్రీతి ఆత్మహత్యయత్నం కేసును మెడికల్ లీగల్ కేసుగా పరిగణిస్తూ ఆయన ఈ చర్యలు తీసుకున్నారు. ఒకవేళ వేధింపుల కేసు రుజువై.. శిక్ష పడితే కాలేజీ నుంచి బహిష్కరిస్తామన్నారు. ఇప్పటికే డీఎంఈకి సీల్డ్ కవర్‌లో వైద్యుల బృందం రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మరోవైపు సమ్మె విరమించుకొని జూనియర్ డాక్టర్లు విధులకు హాజరయ్యారని తెలిపారు.

మరోవైపు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాసేపటి క్రితం డాక్టర్లు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని చెప్పారు. నాలుగు రోజులుగా ప్రీతికి చికిత్స జరుగుతోంది. అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఎక్మోసపోర్ట్‌తో వెంటిలేటర్‌పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది.