గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అయితే ఈ పథకంలో కొంత మంది మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణే పేరుతో ఓ జాబ్ కార్డు మంజూరు అయింది. మధ్యప్రదేశ్లో ఇది వెలుగులోకి రావడం అంతా ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా ప్రతి నెల రూ. 30 వేలు విత్ డ్రా కూడా చేసుకున్నట్టు తేలింది.
పిపార్కెడా నాకా పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, జిల్లా సహాయకుడు లబ్ధిదారుల నకిలీ జాబ్ కార్డులను ఇటీవల రూపొందించారు. వాటిలో మోను దుబే పేరుతో ఉన్న జాబ్ కార్డులలో దీపిక ఫొటోను చేర్చారు. అతడు పనికి వెళ్లకపోయినా ఆ పేరుతో ప్రతి నెల డబ్బులు ఉపసంహరించుకున్నట్టుగా తేలింది. దీంతో జిల్లా పంచాయత్ సీఈఓ గౌరవ్ బెనాల్ విచారణకు ఆదేశించారు. ఇవి ఎవరు ప్రింట్ చేశారు, ఖాతాలోని నగదు ఎలా ఉపసంహరణ జరిగిందో తేల్చాలని సూచించారు. కాగా, మరో ప్రాంతంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫోటోలు ఇలాగే చేశారు.