షావోమి నుంచి రెండు కొత్త ఫోన్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

షావోమి నుంచి రెండు కొత్త ఫోన్లు..

October 16, 2020

fbcfgb

ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్లపై పని చేయనున్నాయి. ఈ ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తాయి. వీటిని వన్ ప్లస్ 8టీ ఫోన్లకు పోటీగా షావోమి తీసుకొచ్చింది. ఎంఐ 10టీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. ధరల విషయానికి వస్తే.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉన్నాయి. 

ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. ఎంఐ 10టీ ప్రో ఒక్క మెమొరీ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. ధర విషయానికి వస్తే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. ఈరోజు నుంచి వీటి సేల్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.3,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్‌పై రూ.2000 అదనపు తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

 

ఎంఐ 10టీ ఫీచర్లు

 

* 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

* ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 

* 64+13+5 ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్,

* 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

 

ఎంఐ 10టీ ప్రో ఫీచర్లు

 

* 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

* ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 

* 108+13+5 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 

* 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.