రెడ్‌మీ నుంచి కొత్త సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే! - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మీ నుంచి కొత్త సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే!

September 26, 2020

redmi

ప్రముఖ చైనీయ మొబైల్ తయారీదారు షావోమి మరో కొత్త సిరీస్ ను లాంచ్ చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే కొత్త కొత్త మోడళ్లను తీసుకుని వచ్చి మార్కెట్‌లో దూసుకుపోతున్నది. తాజాగా రెడ్‌మీ నోట్ 10 పేరుతో కొత్త సిరీస్‌లో ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. గౌగ్విన్‌, గౌగ్విన్‌ ప్రో పేరుతో గతంలో షావోమి వీటిని రిజిష్టర్‌ చేసిందని సమాచారం. 

తాజాగా ఈ ఫోన్లను షావోమి ఎంఐ 10టీ సిరీస్‌ పేరుతో చైనాతో పాటు ఇతర దేశాల్లో సెప్టెంబరు 30న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ 4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీ రానుందట. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 64, 108 ఎంపీ కెమెరాలు ఉంటాయట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబరులో ఈ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది.