Mi clearance sale 2022: Get THESE Redmi phones at half price, check top deals here
mictv telugu

కేవలం రూ.3999 లకే రెడ్ మీ స్మార్ట్ ఫోన్..

November 2, 2022

Mi clearance sale 2022: Get THESE Redmi phones at half price, check top deals here

స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ రెడ్ మీ ఓ మంచి ఆఫర్ అందించింది. క్లియరెన్స్ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే దీనికి ఎలాంటి వ్యారంటీ ఉండదని చెప్పింది. రెడ్ మీ మాతృసంస్థ ఎంఐ.. ఈ క్లియరెన్స్ సేల్ నిర్వహిస్తోంది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎంఐ క్లియరెన్స్ సేల్ అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను సగానికంటే తక్కువ ధరకు అమ్మకానికి పెట్టింది.

బడ్జెట్ ఫోన్ అయిన రెడ్ మీ 6ఏ మోడల్ https://www.mi.com/in/redmi-6a/ ను ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఆ బ్రాండ్ ప్రారంభ ధర రూ.6,999 కాగా.. క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. రెడ్ మీ 6ఏ అనేది చాలా ప్రాథమిక ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ ఉంటుంది. మిగతా మోడళ్లను కూడా తక్కువ ధరకే ఎంఐ అమ్మకానికి పెట్టింది. అయితే, క్లియరెన్స్ సేల్ లో డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ లకు ఎలాంటి వారంటీ ఉండదు. క్లియరెన్స్ సేల్ లో ఫోన్లు కొనాలనుకునే వాళ్లు ఎంఐ అధికారిక వెబ్ సైట్ (https://www.mi.com/in/)  లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.