55 అంగుళాల  షియోమీ టీవీ.. రూ.34,999కే..  - MicTv.in - Telugu News
mictv telugu

55 అంగుళాల  షియోమీ టీవీ.. రూ.34,999కే.. 

November 28, 2019

Mi TV 4X 55-Inch 2020 Edition

4కె పిక్చర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఉన్న టీవీ సెట్లకు మార్కెట్లో ఇప్పుడు మాంచి డిమాండ్ ఉంది. ధరలు అరలక్ష నుంచి మొదలుకుని, లక్షలు దాటిపోతున్నాయి. సోనీ, శాంసంగ్, పానాసోనిక్, ఎల్‌జీ ఇలా రకరకాల కంపెనీలు టీవీలను విక్రయిస్తున్నాయి. కానీ, చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ మాత్రం అతి తక్కువ ధరలో 4కె పరిజ్ఞానంతో కూడిన ఎంఐ టీవీ 4ఎక్స్ 55-2020 ఎడిషన్ టీవీనీ మార్కెట్లోకి తీసుకువస్తోంది. 55 అంగుళాల భారీ స్క్రీన్‌తో కూడిన కొత్త మోడల్‌ను రూ.34,999 కే అందిస్తోంది.

సాధారణంగా 40 అంగుళాల పైబడిన టీవీల ధరలు రూ.40 వేల పైనే ఉంటాయి. జనవరి 31 లోపు కొనుగోలు చేసినవారికి టీవీతో పాటు తక్కువ ధరకే ఎయిర్‌టెల్ డీటీహెచ్ కనెక్షన్ కూడా అందజేస్తోంది. దీంతో వినియోగదారులు నాలుగు నెలల పాటు ఉచితంగా ప్రసారాలు పొందొచ్చు. ఈ ఆఫర్ ఎంఐ వెబ్‌సైట్‌లోనూ, అమెజాన్ పోర్టల్‌లో పొందుపరిచారు. డిసెంబరు 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.