చావుబతుకుల్లో నటుడు.. చికిత్సకి డబ్బుల కొరత - MicTv.in - Telugu News
mictv telugu

చావుబతుకుల్లో నటుడు.. చికిత్సకి డబ్బుల కొరత

October 14, 2020

Actor Faraaz Khan in ICU after brain infection

ఈ ఏడాది బాలీవుడ్ సినీ పరిశ్రమకి అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటికే ఎందరో నటులు మరణించారు. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి కేసు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటీనటులను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. తాజాగా మరో నటుడు ఫరాజ్‌ ఖాన్‌(46) చావుబతుకుల్లో ఉన్నాడు. ఫరాజ్ గత కొన్ని రోజులుగా చెస్ట్‌, బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

దీంతో ఫరాజ్ కుటుంబం దగ్గర డబ్బులు అయిపోయాయి. సినీ నటీనటులు, అభిమానులు సహాయం చేయాలని ఆయన సోదరుడు ఫామాన్‌ ఖాన్‌ కోరాడు. అన్న వైద్యం కోసం ఫామాన్‌ ఖాన్ ఫండ్‌రైజింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా వేడుకుంటున్నారు. ‘చాలా ఏళ్ల క్రితమే ఫరాజ్ సినీ కెరీర్‌ ముగిసిపోయింది. ప్రస్తుతం తనొక చిన్న జాబ్‌ చేస్తున్నాడు. చికిత్స‌ కోసం రూ. 25 లక్షలు అవసరం’ అని ఫామాన్‌ ఖాన్ తెలిపాడు. దీనిపై సీనియర్‌ నటి పూజా భట్‌ స్పందించారు. తన వంతు సాయం చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌ చేశారు. అభిమానూలు ఫరాజ్ కుటుంబానికి సహాయం చేయాలని ఆమె కోరారు. దివంగత నటుడు యూసఫ్‌ ఖాన్‌ తనయుడైన ఫరాజ్‌ ఖాన్‌, పృథ్వీ, మెహందీ, దుల్హన్‌ బనో మై తేరీ, ఫరేబ్‌ వంటి సినిమాల్లో నటించాడు. ష్‌ కోయీ హై, సింధూర్‌ తేరే నాహ్‌ కా, రాత్‌ హోనే కో హై వంటి టీవీ షోలోనూ నటించారు.