కంగారూల కేరాఫ్ అడ్రస్ కర్నూలు..వెలుగు చూస్తున్న చరిత్ర - MicTv.in - Telugu News
mictv telugu

కంగారూల కేరాఫ్ అడ్రస్ కర్నూలు..వెలుగు చూస్తున్న చరిత్ర

May 15, 2019

ముంగాళ్లు పైకెత్తి, వెనక కాళ్లతో చెంగు చెంగున దూకే కంగారూలు చూడముట్చటగా ఉంటాయి. పొట్టలోని సంచిలోంచి పిల్లలు తొంగితొంగి చూస్తుంటాయి. కంగారూ అంటే చప్పున గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియానే. క్రికెట్ జీవులకు కంగారూలు నోళ్లమీదే ఉంటాయి. అవి అక్కడే పుట్టాయని చాలామంది భావిస్తున్నాయి. కానీ తాజా అధ్యయనం దాన్ని తోసిపుచ్చుతోంది.

Australia kangaroos lived in kunnool district jwalapuram of Andhra Pradesh new discovery by archaeologist Jinu Koshy hopping with excitement

జ్వాలాపూరంలో

కర్నూలు జిల్లాలోనూ కంగారూలు తిరిగినట్లు చరిత్ర ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని జ్వాలాపురం కొండల్లో వాటి బొమ్మలను గుర్తించారు. ఈ చిత్రాలు దక్షిణ భారతంలో అత్యంత పురాతన రాతి చిత్రాలు(రాక్ ఆర్ట్)గా భావిస్తున్నారు.   జ్వాలాపురం గుహల్లో ఇదివరకే ప్రాచీన, మధ్యరాతి శిలాయుగాల ఆనవాళ్లు లభించాయి. చెన్నైకి చెందిన ఆర్కియాలజిస్ట్ జిను కోషి అక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అతని టీం జరిపిన తవ్వకాల్లో కొన్ని రాతిపనిముట్లు, జంతువుల అవశేషాలు వెలుగుచూశాయి. ఇక్కడి రాక్ ఆర్ట్‌లో కంగారూలను పోలిన జంతువులు కనిపిస్తున్నాయి. వెనకకాళ్లు పైకెత్తి నిలబడిన జీవి కంగారూనే అని జోషి భావిస్తున్నారు.

Australia kangaroos lived in kunnool district jwalapuram of Andhra Pradesh new discovery by archaeologist Jinu Koshy hopping with excitement

’12 వేల ఏళ్ల నాటి ఈ రాక్ ఆర్ట్‌లో చాలా జంతువులు ఉన్నాయి. జింకలు, దుప్పులు, పందులు, మనకు తెలీని వింత జంతువులను, చిహ్నాలను చిత్రించారు. గుహల్లో, బండలపైన వేల చిత్రాలు ఉన్నాయి. అక్కడక్కడా నిల్చున్న కంగారూలను కనిపిస్తున్నాయి. కొన్నింటికి పొట్ట సంచి కూడా ఉంది. భారత దేశంలో కంగారూలను గుర్తించడం ఇదే తొలిసారి…’ అని కోషి వివరించారు.