కరోనాపై పోరు మరింత పటిష్టం.. రంగంలోకి డ్రోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై పోరు మరింత పటిష్టం.. రంగంలోకి డ్రోన్లు

April 7, 2020

Coronavirus: Drones help Telangana police to implement lockdown, track violators

రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అవుతున్నారు. డ్రోన్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టాలని, నిఘా మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పహాడీ షరీఫ్, చంద్రాయణగుట్ట, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు డ్రోన్ సాయంతో.. ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అదే‌విధంగా అక్కడ లాక్‌డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జన సంచారం ఎలా ఉందనే అంశాలను డ్రోన్లతో పరిశీలించనున్నారు. 

డ్రోన్ల సహాయంతో పూర్తిగా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని.. ఇందుకోసం 4 అత్యంత అధునాతనమైన డ్రోన్లను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘డ్రోన్ల సహాయంతో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఏరియాలను పూర్తిగా నిఘా పెట్టడంతో పాటుగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తాం.  ప్రజలందరూ ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడానికి, ఎక్కడైనా జనం గుంపులు గుంపులుగా గుమిగూడి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ మొదలుపెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ కెమెరాలు వారి ఫోటోలు తీస్తాయి. వీటి ఆధారంగా వారిపై కేసు నమోదు చేస్తాం’ అని కమిషనర్ తెలిపారు.