Home > Featured > పెళ్లికి 50 మందికి అనుమతి!

పెళ్లికి 50 మందికి అనుమతి!

Fifty members allowed for marriages during lock down

లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించిన సంగతి తెల్సిందే. ఈ నెల 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఉంటాయని కేంద్రం తెలిపింది.

ఇందులో భాగంగా పెళ్లి, ఇతర శుభకార్యాలకు 50 మందికి మించి, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదని కేంద్రం తెలిపింది. పెళ్ళికి హాజరు అయ్యేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. ఐదుగురికి కంటే మించి ఉండరాదని తెలిపింది. ఇప్పటివరకు పెళ్లిళ్లకు కేవలం 10 లేదా 20 మందిని మాత్రమే అనుమతించేవాళ్ళు.

Updated : 1 May 2020 10:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top