బీడీలు, సిగరెట్లపై ‘విడి’ నిషేధం.. జేబులకు చిల్లే..  - MicTv.in - Telugu News
mictv telugu

బీడీలు, సిగరెట్లపై ‘విడి’ నిషేధం.. జేబులకు చిల్లే.. 

September 28, 2020

Loose cigarettes beedis selling ban in Maharashtra

మందును కొనాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. పద్దెనిమిదేళ్లు దాటిన వారికే అమ్మాలని, మూడు సీసాలని, ఇంకొకటని ఏవేవో ఆంక్షలు ఉన్నాయి. అయితే బీడీలు, సిగరెట్ల అమ్మకాలపై మాత్రం పెద్దగా ఆంక్షలు లేవు. చూడగానే వాంతికొచ్చేలాంటి కేన్సర్ బొమ్మలున్నా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసున్నా జనం మాత్రం ఎంచక్కా కొనేసి గుప్పుగుప్పున వదిలేస్తుంటారు. ధూమపానంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం వెరైటీ నిషేధం తీసుకొచ్చింది. 

సిగరెట్లను, బీడీలను ఇకపై విడిగా, అంటే ఒకటి, రెండు, మూడు వంటి లెక్కల్లో అమ్మకుండా నిషేధం విధించింది. వాటిని కొనాలంటే ఇక కట్ట కట్ట, ప్యాకెట్ ప్యాకెట్ కొనాల్సిందే. సిగరెట్ డబ్బాలకైతే వందలు సమర్పించుకోవాల్సిందే. దేశంలో ఇలాంటి నిషేధాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వ్యాపారులు దీనిపై మండిపడుతున్నారు. బీదాబిక్కీ ప్యాకెట్లకు ప్యాకెట్లు కొనలేరని, నిషేధాన్ని ఎత్తేయాలని చెప్పుకొస్తున్నారు.