కీర్తిసురేష్, విద్యబాలన్‌ల కొత్త చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

కీర్తిసురేష్, విద్యబాలన్‌ల కొత్త చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల

May 15, 2020

Movies Released On Amazon Prime

సిల్వర్ స్క్రీన్‌పై  కాసుల వర్షం కురిపించాల్సిన సినిమాలపై లాక్‌డౌన్ ప్రభావం గట్టిగానే పడింది. థియేటర్లు మూసుకుపోవడంతో ఎన్నో చిత్రాల విడుదల ఆగిపోయింది. నెలల తరబడి దీన్ని పొడిగిస్తూ ఉండటం.. ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కనబడటం లేదు. దీంతో నిర్మాతలు డిజిటల్ మాధ్యమాల వైపు చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా సినిమాలను విడుదల చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్, విద్యాబాలన్ నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాను ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. స్ట్రీమ్ పేరుతో తెలుగులో కూడా రానుంది. దీనికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజు నిర్మాతగా ఉన్నారు. విద్యా బాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన శకుంతలా దేవి’ కూడా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. కానీ విడుదల తేదీని మాత్రం చెప్పలేదు.ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ముందుగా మే 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ కూడా మే 22న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదనే వాదన చిత్రవర్గాల్లో వినబడుతోంది.