ఆరు నెలల కష్టం ఫలించింది. మట్టిలో, రాళ్లలో కళ్లింతలు చేసుకుని సాగిన వెతుకలాట నెరవేరింది. ఇద్దరు కూలీలు పిసరత రాళ్లతో లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఇద్దరు కూలీలకు వజ్రాలు లభించాయి. ఇద్దరికీ కలిపి కోటి రూపాయల విలువైనవి దొరికాయి.
జరువపూర్కు చెందిన దిలీప్ మిస్ర్తీ అనే కార్మికుడికి 7.44 కేరట్ల బరువైన వజ్రం దొరికింది. కృష్ణకల్యాన్పుర్ ప్రాంతంలో లఖన్ యాదవ్ అనే మరో కార్మికుడు 14.98 కేరట్ల బరువైన వజ్రాన్ని దొరికించుకున్నాడు. అధికారులు నిత్యం కన్నేసి ఉంచడంత విషయం వారికి చెప్పక తప్పలేదు. చాటుమాటుగా అమ్మితే సమస్యలు వస్తాయని ఇద్దరూ అధికారులకు వాటిని అందజేశారు. వాటిని వేలంలో అమ్మేస్తామని, 12.5 రాయల్టీగా పట్టుకుని మిగతా సొమ్ము అందజేస్తామని అధికారులు చెప్పారు. మిస్త్రీకి దొరికిన వజ్రం రూ. 30 లక్షలు, యాదవ్కు దొరికిన వజ్రం రూ. 60 లక్షలకుపైగా ధర పలుకుతాయని డైమండ్ చెకింగ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్ చెప్పారు. లఖన్ యాదవ్కు తన రెండు ఎకరాల భూమిలో తొలిసారి వజ్రాన్ని బయటికి లాగాడు. తనకొచ్చే డబ్బుతో పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పాడు. దేవుడి దయవల్లే తనకు వజ్రం దొరికిందని మిస్త్రీ దండం పెట్టుకున్నాడు.