ఒంటరిగా వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళ్లు అర్పించిన నటి - MicTv.in - Telugu News
mictv telugu

ఒంటరిగా వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళ్లు అర్పించిన నటి

May 29, 2020

Poonam Kaur Tribute to NTR

ఎప్పుడు సంచలన ట్వీట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా నటి పూనం కౌర్ మరోసారి ఆసక్తిక ట్వీట్ చేశారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పించిన వీడియోను పోస్టు చేశారు. ఒంటరిగానే ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లిన ఆమె పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను పొగుడుతూ.. ఆయన దీవెనలు ఇవ్వాలని కోరారు. ఆయన్ను తెలుగు ప్రజల దేవుడిగా అభివర్ణించారు. ఎప్పుడూ లేనిది కొత్తగా పూనం ఇలా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

వీడియో పోస్ట్ చేస్తూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ‘స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్ని ఇచ్చేలా దీవించండి. మానవత్వం  కరవైన ఈ రోజుల్లో మీ లాంటి నటులు, నాయకుల అవసరం ఎంతో ఉంది’అంటూ భావోద్వేగాలు ప్రదర్శించారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయాన్నే ఆయన కుటుంబ సభ్యులు, పలువురు అభిమానులు, పార్టీ కార్యకర్తలు నివాళ్లు అర్పించారు.