రెండు హత్యలు.. మనస్తాపంతో ఎస్ఐ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

రెండు హత్యలు.. మనస్తాపంతో ఎస్ఐ ఆత్మహత్య

August 1, 2020

sub inspector kiran kumar passed away

ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ రెండు హత్యలు జరిగాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. నెటిజన్లు ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసులను ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో జిల్లా ఎస్పీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్ల్స్, ఎస్పీకి ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయం దీంతో ఓ యువ ఎసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది.

చెన్నరాయపట్టణ పోలీస్ స్టేషన్ లో వరుసగా రెండు హత్యలు జరిగాయి. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ వచ్చాయి. దీంతో హాసన్ జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీనివాసగౌడ రంగంలోకి దిగారు. దీంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చెన్నరాయపట్టణ ఎసై కిరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్సై ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. కిరణ్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న హెచ్‌డీ రేవణ్ణ చెన్నరాయనపట్టణకు చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.