బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది.. కొత్త గెటప్ లో నాగార్జున - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది.. కొత్త గెటప్ లో నాగార్జున

August 13, 2020

Telugu bigg boss season 4 promo got released

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 త్వరలో ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ప్రోమోను బుధవారం రోజున స్టార్ మా విడుదల చేసింది. ఇందులో నాగార్జున ఓ వృద్ధుడి వేషంలో కనిపిస్తారు. నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడ్డానికి స్టే ట్యూన్డ్ అంటూ స్టార్ మా ఈ ప్రోమోకి క్యాప్షన్ ఇచ్చింది. ఈ టీజర్‌లో నాగార్జున ఒక దుర్భిణి పెట్టుకొని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరుగుతోందో చూడాలనే ఆరాటంలో ప్రేక్షకులు ఉన్నట్టు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ నాగార్జున లుక్ గురించి చర్చించుకుంటున్నారు. 

హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ ప్రోమోను చిత్రీకరించారు. కరోనా మహామ్మారి కారణంగా ఈసారి బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెల్సిందే. ఈ సారి బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున ప్రారంభించాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు నిర్దారించిన తరువాతే హౌస్‌లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ షూటింగ్ లో తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో లాగా 100 రోజులు కాకుండా.. ఈసారి 70 రోజుల్లోనే ముగించాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్టు సమాచారం.