'బిగ్ బాస్ 4' ప్రోమో సిద్ధం అవుతోంది..హోస్ట్ ఎవరంటే? - MicTv.in - Telugu News
mictv telugu

‘బిగ్ బాస్ 4’ ప్రోమో సిద్ధం అవుతోంది..హోస్ట్ ఎవరంటే?

August 1, 2020

Telugu bigg boss season 4 promo soon to be released

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ రియాలిటీ షో త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సీజ్ ప్రోమో షూట్ జరుగుతోంది. హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ ప్రోమోను చిత్రీకరించారు. 

దీనికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే ‘బాహుబలి’ కెమెరామేన్ కెకె సెంథిల్ కుమార్ చిత్రీకరించారు. ఈ ప్రోమో షూటింగ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ నిబంధనలను పాటించారు. త్వరలోనే ఈ ప్రోమో టీవీలలో ప్రసారం కానుంది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేవారి జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి షోని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.