mictv telugu

ఎయిర్‌పోర్ట్‌లో పావు క్వింటాల్ బంగారం జప్తు

January 12, 2019

ఎయిర్‌పోర్టులు బంగారం గనులుగా మారిపోతున్నాయి. గనుల్లోకూడా దొరకనంత పసిడి విమానాశ్రయాల్లో దొరుకుతోంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల బంగారాన్ని పసిగట్టారు. దీని విలువ రూ. 8 కోట్లు. ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి (ఏఐయూ) చెందిన కస్టమ్స్‌ అధికారులు ఐదుగురు ప్రయాణికులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని సీజ్‌ చేశారు.  ఐదుగురు నిందితులను దక్షిణా కొరియా జాతీయులుగా గుర్తించారు. వీరు హాంకాంగ్‌ నుంచి చెన్నైకు వచ్చారని, బంగారాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.