మనసున్న యజమానురాలు.. పనిమనిషికి ఇల్లు, కారు గిఫ్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

మనసున్న యజమానురాలు.. పనిమనిషికి ఇల్లు, కారు గిఫ్ట్..

January 8, 2019

పని మనుషుల అవసరం వుంటుంది కానీ వారి బాగోగుల గురించి ఏ యజమానులు పట్టించుకుంటారు చెప్పండి. బండెడు చాకిరీ చేయించుకుని, చాలీచాలని జీతాలు వాళ్ల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుంటార. వాళ్లను యంత్రాల్లా తప్ప మనుషుల్లా గుర్తించరు. ఈమధ్య అక్కడక్కడా కొందరు పనిమనుషులు దొంగతనాలకు పాల్పడటంతో వారిని ఇంకా దూరం పెడుతున్నారు యజమానులు. ఇదిలావుండగా ఓ యజమాని పనిమనిషికి కారు బహుమతిగా ఇచ్చి తన సహృదయతను చాటుకుంది. పనిమనుషులంటే చులకనగా చూసేవారికి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారీమె. ఆమె తన ఇంటి పనిమనిషి కాదు తన కుటుంబ సభ్యురాలని చెప్పారు.Telugu news Filipina nanny reseives car as gift from employerవివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో నివాసముంటున్న మైక్‌పెక్ అనే మహిళ ఇంట్లో ఫిలిఫైన్స్‌కు చెందిన సెలో(47) అనే మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. సెలో ఆ ఇంట్లో పనిమనిషిగా చేరినప్పుడు మైక్‌పెక్ చాలా చిన్నివాళ్ళు. అప్పటినుంచి మైక్ పిల్లలను తన పిల్లలుగా భావించి, వారి ఆలనా పాలనా అంతా తానే చూసుకుంది. ఒకానొక సందర్భంలో తన పిల్లలకు సెలోనే తల్లి అయిందని చెప్పారు మైక్‌పెక్. తన కన్నా సెలోతోనే వారికి అనుబంధం ఎక్కువని తెలిపారు.

తన పనుల్లో తాను బిజీగా వుండటంవల్ల పిల్లల బాగోగులు చూసుకోవడం వీలు కాలేదు. అప్పుడు సెలో తనకు బాసటగా నిలిచిందని వివరించారు. పిల్లలు తనకన్నా ఎక్కువగా సెలో దగ్గరే వుంటారని చెప్పారు. అలా ఆమె నెమ్మదిగా మా కుటుంబంలో కలిసిపోయింది. అందుకే ఆమెకు తాను ఏదైనా చెయ్యాలని భావించానని తెలిపారు. ఈ క్రమంలోనే  గతేడాది ఆమెకు స్వదేశంలో ఇల్లు కూడా కొనిచ్చానని వెల్లడించారు.

సెలో కొడుకు కూడా దుబాయ్‌లోనే పనిచేస్తున్నాడు. తరచూ సెలో అతడి దగ్గరికి వెళ్లి కలిసి వస్తుంటుంది. ఆ క్రమంలో ఆమె రెండు బస్సులు మారాల్సి ఉండేది. ప్రస్తుతం అయిదు బస్సులు మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని మైక్ తెలిపింది. ఆ కష్టం తప్పించేందుకు సెలోకు కారు కొనిచ్చానని ఆమె తెలిపింది. ఇది సాయం కాదని తన బాధ్యత అంటున్నారు మైక్‌పెక్. మైక్ మంచి మనసుకు సోషల్ మీడియాలో జేజేలు పలుకుతున్నారు.