ఏపీలో కియోల తయారీ.. ఒకసారి చార్జ్ చేస్తే 455 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కియోల తయారీ.. ఒకసారి చార్జ్ చేస్తే 455 కి.మీ.

December 6, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియో కార్ల కంపెనీ వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో దేశీయ కియో తొలి కారు ఆంధ్ర ప్రదేశ్ రోడ్లపైకి రానుందని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ప్లాంట్ వెలిసింది.  ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయం వద్ద రోజు కిియోఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కారులో కొద్దిదూరం ప్రయాణించి, మీడియాతో మాట్లాడారు.Telugu news Kyoto Motors In AP.. The desi car in January next year‘కియో కారు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు హబ్‌గా మారబోతోంది. కియో మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలే మారిపోతాయి. కియో కంపెనీ ఇక్కడ తయారుచేసే కార్లలో 90 శాతం దేశీయంగా అమ్ముతారు. మిగిలిన 10 శాతం కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారు.
విద్యుత్ చవకగా మారేందుకు, సౌర విద్యుత్ ఒక్కో యూనిట్ రూ.1.50కే లభ్యమయ్యేలా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని తెలిపారు చంద్రబాబు.

ఏపీలో వ్యర్థాల సేకరణకు త్వరలోనే 7,300 ఎలక్ట్రానిక్ వాహనాలను వినియోగిస్తామని అన్నారు. పర్యావరణ రహితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబు చార్జింగ్ స్టేషన్‌ను, ఎలక్ట్రానిక్ కార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు రకాల నీరో హైబ్రిడ్, నీరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నీరో ఎలక్ట్రిక్ కార్లను ఏపీ ప్రభుత్వానికి బహుమతిగా అందజేసింది. వాహనాలను ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకధాటిగా 455 కిలోమీటర్లు నడుస్తాయి.