mictv telugu

కీసర చెరువు కబ్జా.. కేటీఆర్‌! మీరేమీ చేయరా?

January 9, 2019

సోషల్ మీడియాతో చెడే కాకుండా మంచి కూడా జరుగుతోంది. అన్యాయాలను, అక్రమాలను బట్టబయలు చేయడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోంది. ప్రజలు నేరుగా రాజకీయ నేతలకు విషయం చెప్పేస్తున్నారు, మేరేమీ చేయరా అని నిలదీస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసర చెరువును కబ్జా చేస్తున్నారని ఓ నెటిజన్.. టీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.Telugu news netizen complaints to TRS leader KTR on encroachment of Medchal district Keesara tank land ఓ వ్యక్తి రెండు ఎకరాల మేర కబ్జా చేస్తున్నాడని, చెరువులోకి మట్టి తోలిస్తున్నాడని వెంకట్ బోగి అనే వ్యక్తి ట్విటర్ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ‘అయ్యా, మా గోడు వినిపించదా మీకు? మేం ఏమీ చేయం.. మీడియాలో, పేపరులో రాయిస్తాం అంతే.. అని అనుకోవాలా చెప్పండి. ఇవ్వాళ ఎవ్వడో వచ్చి  ప్రభుత్వం నాకు చెరువులో 2 ఎకరాలు ఇచ్చింది అంటూ పెద్ద పెద్ద లారీల్లో మట్టి తెచ్చి చెరువు పూడుస్తున్నాడు. దీనిపై స్పందించండి.. ’ అని ట్వీట్ చేశారు. చెరువులో మట్టి తోలిచిన ఫొటోను కూడా జత చేశాడు. దీనిపై కేటీఆర్ వెంటన స్పందించాడు. కబ్జా వ్యవహారంపై  వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులను ఆయన ఆదేశించారు.Telugu news netizen complaints to TRS leader KTR on encroachment of Medchal district Keesara tank land