mictv telugu

వారికి 21 మంది సంతానం.. అయినా నో టెన్షన్..

January 10, 2019

ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అంటున్న ఈ తరుణంలో ఓ జంట ఏకంగా 21 మంది సంతానానికి జన్మనిచ్చారు. అసలే ప్రపంచ జనాభా మితిమీరిపోతుంటే ఇలా అడ్డూఅదుపులేకుండా యంత్రాల్లా కంటూపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అంతమందికి చదువులు, పోషణ, పెళ్లిళ్ళు, ఉద్యోగాలు.., ఎన్ని వుంటాయి. అయినా అవన్నీ నైజాన్తా అన్నట్టే చేశారు ఈ జంట. ఆ జంట పేరు సూ, నోయల్ రెడ్‌ ఫోర్డ్. తాజాగా వారికి 21వ బిడ్డ జన్మించింది. అతిచిన్న వయసులోనే వారికి వివాహమైంది. సూ తన 13వ ఏటనే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.Telugu news This woman has 21 children. She had her first pregnancy at the age of 132008లో 13 వ బిడ్డ పుట్టినప్పుడు ‘బేకర్స్‌ డజన్‌’ అంటూ వారిని చాలామంది టీజ్‌ చేశారు కూడా. అయినా వారు పిల్లల పంట పండించడం ఆపలేదు. కంటూనే వున్నారు. అలా 21మంది పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అదుపులేని వీరి సంతాన సాఫల్యతను చూసి చాలామంది ఆశ్చర్యపోతూనే విమర్శిస్తున్నారు. ఆమె అంత చిన్న వయసులో తల్లికావడం నేరం అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా మా పిల్లలు మాకు భారం కారు అంటున్నారు ఆ దంపతులు. మేము చాలా నిశ్చింతగా వున్నామని తాపీగా సమాధానం ఇస్తున్నారు వాళ్ళు. కాగా, వారు బ్రిటన్‌లోనే పెద్ద కుటుంబంగా రికార్డులకెక్కారు. కోడి గంపెడు పిల్లల్ని కన్నట్టున్న వీరి ఫ్యామిలీపై ఓ మీడియా సంస్థ ‘21 కిడ్స్ అండ్ కౌటింగ్’ పేరుతో డాక్యుమెంటరీని తీసింది. దానిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.