mictv telugu

వికారాబాద్ షాక్.. పోలైన ఓట్లు 538… ఈవీఎంలో 555

December 8, 2018

ఎన్నికల చిత్రాలు ఇన్నీ అన్నీ కావు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని వేలమంది నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. మరో పక్క కొన్నిచోట్ల ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఈఓ రజత్ చెప్పిన క్షమాపణతో ఒరిగేదేమీ లేదని, తమకు అన్యాయం జరిగిందని బాధితులు మండిపడుతున్నారు.వికారాబాద్లోని పోలింగ్ బూత్లో విచిత్రం జరిగిది. ధారూర్ మండలంలోని 183 పోలింగ్ బూతులో మొత్తం ఓటర్ల సంఖ్య 556. శుక్రవారం పోలింగ్‌లో  518 మంది ఓటేశారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంను పరిశీలించగా అందులో 555 ఓట్లు పోలైనట్లు చూపించింది. అంటే  37 ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతో పోలింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  దీనిపై అధికారులు స్పందించారు. వాస్తవ పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. సాంకేతిక లోపాలు జరిగాయో లేదో తేలుస్తామని,  అవసరమైతే రీపోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ ఒమర్ జలీల్ తెలిపారు.  కాగా, రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది.