ఫొటో మే సవాల్.. ఇందులో పులి ఎక్కడుందో కనుక్కోండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఫొటో మే సవాల్.. ఇందులో పులి ఎక్కడుందో కనుక్కోండి!

May 16, 2019

ప్రకృతిలో వింతలు, విడ్డూరాలకు కొదవ లేదు. ఆకులో ఆకునై, పువ్వులై పువ్వునై అని ఓ కవి అన్నట్లు చెట్లపుట్ల మాటున జీవరాశి ఒదిగి ఒదిగి ఉంటుంది. అందుకు ఈ ఫొటోనే ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గ్రామం కిబర్ సమీపంలో తీసింది.

View this post on Instagram

Art of camouflage…

A post shared by Photographs by Saurabh Desai (@visual_poetries) on

ఇందులో పులి ఉందట! కానీ తొలిసారి చిత్రం చూసిన వాళ్లు దాన్ని కనుక్కోలేక తంటాలు పడుతున్నారు. స్నో లెపర్డ్ ఉందని చెప్పడంతో ఇదేదో తమాషా చిత్రమని, మంచు ఆకృతిలో ఉన్న పులి రూపం ఏదో ఉంటుందని భావిస్తున్నారు. అయితే భూతద్దం పెట్టుకుని చూసినట్లు చూస్తే ఇందులో అసలు పులి కనిపిస్తుంది. పై భాగంలోని మంచు కొన కింద దాని ముఖం ఉంది. రాళ్ల రంగు, దాని రంగు కలసి పోవడంతో దాన్ని గుర్తించడం కష్టంగా మారిందన్నమాట. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ ఈ ఫొటో తీశాడు. సోషల్ మీడియాలో ఇది జనానికి అగ్నిపరీక్ష పెడుతోంది.