Mic TV exclusive interview with CCS SI Gaddam Mallesh
mictv telugu

సైబర్ మోసాలు తెలుసుకోండి.. సైబర్ క్రైం ఎస్సై గడ్డం మల్లేష్‌తో ఇంటర్వ్యూ

September 8, 2022

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొన్ని పనులు చాలా సౌకర్యవంతంగా పూర్తవుతున్నాయి. అదే సమయంలో మోసాలు, నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. వీటి బారిన చదువురాని వారితో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లూ బాధితులుగా మారుతున్నారు. కొన్ని సార్లు బాధితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు చూసి సీసీఎస్ ఎస్ఐ గడ్డం మల్లేష్ ఆవేదన చెందారు.

ప్రజల్లో జాగరూకత కలిగించాలనే లక్ష్యంతో భార్య సుశీలతో కలిసి ‘క్రైం ఫ్రీ ఇండియా’ అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అనేక సమస్యలపై విశ్లేషణాత్మక వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీవారం ఓ సమస్యను ఎన్నుకొని ఎలా ఎదుర్కోవాలి? ఎలా మోసం చేస్తారు? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? వంటి అంశాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నెలలో రెండో, నాలుగో శనివారం వీడియోలు రూపొందిస్తూ ప్రజల మన్నన పొందుతున్నారు. ఓ వైపు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఖాళీ సమయంలో ఈ వీడియోలు రూపొందిస్తుండడంతో పై అధికారులు కూడా మల్లేష్ గారిని ప్రోత్సహిస్తున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పలు కార్డుల నంబర్లు ఎవరికీ షేర్ చేయవద్దనీ, ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే 48 గంటల్లోగా ఎలా రికవరీ చేసుకోవాలో సవివరంగా తెలియజేస్తున్నారు. మొదట కానిస్టేబుల్‌గా పనిచేసి తర్వాత ఎస్సైగా ఎన్నికైన గడ్డం మల్లేష్ తన పనితీరు వల్ల ఇప్పటివరకు 150 వరకు రివార్డులు అందుకున్నారు. లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ వంటి పలు విభాగాల్లో పనిచేసి విశేష అనుభవం గడించిన మల్లేష్ గారి ఇంటర్య్వూ ప్రత్యేకంగా ప్రేక్షకుల కోసం మైక్ టీవీ అందిస్తోంది.