లక్ష్మీస్ ‘ఎన్టీఆర్‌’ విజయ్‌ మైక్‌టీవీతో ఏమన్నారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీస్ ‘ఎన్టీఆర్‌’ విజయ్‌ మైక్‌టీవీతో ఏమన్నారంటే..

April 1, 2019

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అనగానే మనకు ఆ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆరే వచ్చి జీవించాడా అనిపిస్తుంది. అంతగా ఆ పాత్రకు వన్నెతెచ్చారు రంగస్థల నటుడు కొయ్యలగూడెం విజయ్ కుమార్. రియల్ ఎన్టీఆర్‌ను రీల్ మీద ఆవిష్కరించిన రీల్ ఎన్టీఆర్ విజయ్. ఆ పాత్రలో ఆయన నటించారు అనేకంటే జీవించారు అనాలి. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ పాత్రకు సరితూగే నటుడిని ఎన్నుకున్నాడు. ఆయనతో మైక్ టీవీ ముచ్చటించింది. ఆయన మనసులోని భావాలను పంచుకుంది. తన 45 సంవత్సరాల రంగస్థల అనుభవాలను, అందులోని సాధకబాధకాలను పంచుకున్నారు. స్టేజీ అనుభవం వుండబట్టే ఈ పాత్రను సమర్థవంతంగా చేయగలిగాను అని అన్నారు. రంగస్థలంలో స్టామినా ఎక్కువ కావాలి, సినిమాకి ఓపిక కావాలని తనదైన శైలిలో చెప్పారు.

ఈ పాత్రకు తాను సెలెక్ట్ అవుతానని అస్సలు అనుకోలేదట. ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి వీడియో తీసి పంపమన్నారట. అలా వీడియో తీసి పంపాక పది రోజుల తర్వాత వర్మ ఫోన్ చేసి పిలిపించి పాత్ర ఆఫర్ చేశారని చెప్పారు. ఈ పాత్ర కాంట్రవర్సీ అవుతుందని ముందే ఊహించారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ కాంట్రవర్సీ అంటే నాకు తెలియదు అని తాపీగా చెప్పారు. నాటకాల్లో అనేక అవార్డులు, ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నట్టు తెలిపారు. పద్యాలు ఆలపించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆర్టిస్టుగా తనకు వచ్చిన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చెయ్యాలనే ఆలోచించాను తప్పితే రాజకీయంగా తానేమీ ఆలోచించలేదని అన్నారు. ఇలా ఎన్నో విషయాలు ఆయన మైక్ టీవీతో పంచుకున్నారు. క్రింది లింకులో ఇంకా అనేక విషయాలు మీరూ చూడవచ్చు.