ఐపీఎల్ -2023 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31వ తేదీ నుంచి కొదమసింహాల్లా తలపడేందుకు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సారైన కప్పు కొట్టేయాలని ఆర్సీబీ భావిస్తోంది. మరోసారి ‘ఈ సాలా కప్ నమదే’ అంటోంది . అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆ టీంకు షాక్ తగలింది. రూ.3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు మినీ వేలంలో కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ గాయండతో దూరమయ్యాడు. బంగ్లాదేశ్ టూర్‌లో జాక్స్ గాయపడడంతో ఆతడు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. భారీ హిట్టర్ ఐనా జాక్స్ జట్టుకు దూరం కావడంతో ఒక్కసారిగా ఆర్సీబీ అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఇక జాక్ స్థానాన్ని విధ్వంసకర ఆల్ రౌండర్ తో బెంగళూరు యాజమాన్యం పూరించింది. న్యూజిలాండ్‌కు బ్రేస్‌వెల్‌ను రూ.కోటి చెల్లించి జట్టులో చేర్చుకుంది. న్యూజిలాండ్ తరఫున తక్కువ మ్యాచ్ లే ఆడిన తన సత్తా ఎంటో ఇప్పటికే చూపించాడు బ్రేస్‌వెల్.
లెఫ్టార్మ్ బ్యాటింగ్, రైటార్మ్ బౌలింగ్ చేసే బ్రేస్ వెల్ ఈ ఏడాది భారత్ తో జరిగిన సిరీస్‌లో చెలరేగాడు. మూడు వన్డేల సిరీస్‌లో బ్రేస్‌వెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంతో హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో బ్రేస్ వెల్ మెరుపు సెంచరీ సాధించి భారత్ కు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. 7 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 78 బంతుల్లోనే 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు సాధించాడు. దీంతో ఏడో స్థానంలో వచ్చి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా బ్రేస్ వెల్ చరిత్రకెక్కాడు. అయితే అదృష్టవశాత్తు ఆ మ్యాచ్ లో టీం ఇండియా గెలిచింది. అంతేకాకుండా కెరీర్ ఫస్ట్ టీ20.. తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్ తీసిన బౌలర్ కూడా బ్రేస్‌వెల్ కావడం విశేషం. ఐర్లాండ్‌తో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ ఈ ఘనతను అందుకున్నాడు.
అయితే బెంగళూరు తుది జట్టులో బ్రేస్‌వెల్‌కు దక్కే ఎంతమేరకు ఉందన్నది చూడాలి. అతడు జట్టులోకి రావాలంటే మ్యాక్స్ వెల్, హసరంగలో ఒకరు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంది. దీనిపై టీం మేనేజ్ మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.