పార్టీలకు మరో పండగ.. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీలకు మరో పండగ.. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు ఆదేశం

October 11, 2018

ముందస్తు ఎన్నికల సందట్లో మునిగి తేలుతున్న రాజకీయ పార్టీలో మరో పండగ వచ్చేసింది. వచ్చే మూడునెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది.Conduct Telangana Panchayat elections with in three months High court orders to state Government and elections commission angry on continuation of special officersఆ మూడు నెలల వ్యవధిలో ప్రత్యేక అధికారుల సేవలను కొనసాగించుకోవచ్చని, ఆలోపు ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్నికోర్టు  ఆదేశించింది.  పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడాన్ని వెంకటేశ్ అనే న్యాయవాది సవాలు చేస్తూ కోర్టులో దావా వేశరు. దీన్ని కోర్టు ఈ రోజు విచారించి పై ఆదేశాలు జారీ చేసింది.