దగాలో దగా… ఓటర్లకు నకిలీ నోట్ల పంపిణీ… - MicTv.in - Telugu News
mictv telugu

దగాలో దగా… ఓటర్లకు నకిలీ నోట్ల పంపిణీ…

October 15, 2018

ఎన్నికలు అంటేనే ఓ దగా. ప్రజలను మభ్యపెట్టే ఓ తియ్యని కుట్ర. ఆ దగాలో మరో దగా అయితే ఎలా వుంటుంది ? అంటే సదరు నాయకుల దృష్టిలో ప్రజలంటే ఎంత చిన్నచూపుందో క్లియర్‌గా అర్థమవుతుంది. ఎన్నికల సీజన్ మొదలవగానే నాయకులంతా తమ తమ గెలుపుల కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ఎలాగైనా గెలవాలనుకునే నాయకులు మందు, మనీని పంచడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తమ వద్ద అసలు లేకపోతే నకిలీ నోట్లకు, నకిలీ మందులు పంచటానికి పూనుకుంటున్నారు. జనాలే కదా వాళ్ళకు ఏవిచ్చినా గొర్రెల్లా తీసుకుని మనకు ఓట్లు వేస్తారనే గొప్ప కాన్ఫిడెన్సుతో డొల్ల నాయకులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.Distributing fake notes to voters …అసలైన కరెన్సీ నోట్లను స్కాన్ చేసి, నకిలీ నోట్లను ముద్రించి జనాలకు పంచి తమకు ఓట్లు పడేలా చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నాయకులు నకిలీ నోట్లు ముద్రించి ప్రజలకు పంచుతున్నారు. రూ.500, రూ.200ల నకిలీ నోట్లను పంచుతున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని హోషానాబాద్, రాజ్ ఘడ్ ప్రాంతాల్లో పోలీసులు రూ. 31.5 లక్షల విలువ చేసే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముద్రణలో రాష్ట్ర హాకీ మాజీ ఆటగాడు అఫ్తాబ్ అలీ అలియాస్ ముస్తాఖ్ ఖాన్ (42)ను కీలక వ్యక్తిగా వున్నాడని గుర్తించారు. అఫ్తాబ్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓటర్లకు పంచేందుకు వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్ల విలువైన నకిలీ నోట్ల ముద్రణకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. భాగోతంలో ఇంకా ఎంతమంది తలమునకలై వున్నారు, అసలైన వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తు ప్రారంభించారు.