DMK Leader Kanimozhi's Home Raided By Income Tax Officials
mictv telugu

కనిమొళి ఇంట్లో ఐటీ దాడులు

April 16, 2019

ఎన్నికల వేళ ఐటీ కొరడాలు ఛళ్లుమంటున్నాయి. డీఎంకే ఎంపీ, ఆ పార్టీ చీఫ్ స్టాలిన్ సోదరి కనిమొళి ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్న కనిమొళి నివాసం, పార్టీ కార్యాలయంలో 10 మంది ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  ఆమె అనుచరులు కోట్లాది నగదును దాచారని సమాచారంతో దాడులు సాగుతున్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని  అధికారులు చెప్పారు.

gg

దాడులపై  డీఎంకే శ్రేణులు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. తూత్తుకుడిలోని కనిమొళి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీకి మద్దతు పలకలేదనే కనిమొళితోపాటు పలువురు డీఎంకే నేతలను ఐటీ అధికారులు టార్గెట్ చేసుకుంటున్నారని పార్టీ శ్రేణులు మండి పడుతున్నాయి. వేలూరు డీఎంకే అభ్యర్థి భారీగా డబ్బు దాచిన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి.