మద్యం మత్తులో మీరు తలుపు తడుతున్నారా? అయితే ఇప్పటి నుంచి అది మీ ఇళ్లో కాదో తెలుసుకున్నాకే తట్టండి. ఎందుకో తెలుసా ? మత్తులో మద్యం మత్తులో ఓ వ్యక్తి పక్కింటి తలుపులు కొట్టాడు. దీంతో వారు అతన్ని చితకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ మీర్పేట్ జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.నందనవనంకు చెందిన మొగిలి గోపాల్ (45) వృత్తిరీత్య కూలి పనులు చేస్తుంటాడు. ఆదివారం ఫుల్ గా మందుకొట్టిన గోపాల్ తన సోదరిని కలిసేందుకు ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్‌కు వెళ్లాడు. తన సొదరి ప్లాట్ అనుకుని అంజలి అనే మరో మహిళ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. అంజలి బయటకు వచ్చి చూడగా గోపాల్ పొరబడినట్లు తెలుసుకుని ఆమెను మంచినీళ్లు అడిగాడు.
అతణ్ణి చూసి బయటపడిన అంజలి తన సోదరుడు ఆనంద్‌కు చెప్పింది. కోపంతో ఊగిపోయిన ఆయన గోపాల్‌పై దాడిచేశాడు. ఆయన తిరిగి వెళ్లిపోతుండగా ఆనంద్ వెనుక నుంచి బలంగా తన్నాడు. దీంతో గోపాల్ మొదటి అంతస్తు మెట్లపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను అతని సొదరి కవిత ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ గోపాల్ మృతి చెందాడు. సోదరి కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.