8 ఏళ్లకే నామీద లైంగికదాడి జరిగింది… మూడుసార్లు చేదు అనుభవం… చిన్మయి - MicTv.in - Telugu News
mictv telugu

8 ఏళ్లకే నామీద లైంగికదాడి జరిగింది… మూడుసార్లు చేదు అనుభవం… చిన్మయి

October 8, 2018

‘మీటు’ ఉద్యమంలో భాగంగా చాలా మంది మహిళలు తమ మీద జరిగిన లైంగిక దాడులను బయటకు చెబుతున్నారు.  ప్రస్తుతం బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా, నటుడు నానా పటేకర్ మీద చేసిన ఆరోపణలతో అక్కడ వేడి వాతావరణం నెలకొని వుంది. తాజాగా టాలీవుడ్ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తనమీద జరిగిన లైంగిక దాడుల గురించి తెలిపారు. సోషల్ మీడియాలో మీటూలో భాగంగా చిన్మయి తన చేదు అనుభవాలను పంచుకున్నారు.

తనకు 8 లేదా 9 ఏళ్ల వయసు వున్నప్పుడు తన ఒంటి మీద ఓ అంకుల్ అసభ్యంగా తాకాడని చెప్పారు. తాను నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తి తన రహస్య భాగాలను తాకాడని వివరించారు. అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్‌లో బిజీగా ఉండగా ఈ ఘటన జరిగిందని… ఈ విషయం అమ్మకు కూడా చెప్పానని తెలిపారు. అది శాంతోమ్‌ కమ్యూనికేషన్స్‌ స్టూడియోలో జరిగింది.. ఆ స్టూడియో ఇప్పటికీ ఉందని పేర్కొంది.For 8 years I was sexually harassed ... three times bitter experience ... Chinmayi‘10 లేదా 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కూడా నామీద లైంగిక దాడి జరిగింది. డిసెంబర్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. కొంతమంది తన షర్ట్ జేబుల్లో ఏముందో చూస్తామంటూ చేతులు పెట్టేవారు. చిన్న వయసులోనే నామీద చేతులు వేసినవాళ్ళు నాకు  19 ఏళ్ల వయసుంటే ఊరుకుంటారా ? ఓరోజు సంఘంలో మంచి పేరున్న వ్యక్తి.. తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు.

నాతో అమ్మ కూడా వచ్చింది. అయితే, నన్ను ఒంటరిగా ఆఫీసులోకి రమ్మన్నాడు. లోపలికి వెళ్లగానే కౌగిలించుకుని పైకి ఎత్తాడు. అంతవరకు ఆయనంటే నాకు గౌరవం వుండేది. ఆ ఘటనతో అతని మీద గౌరవం పోయింది’ అని చెప్పారు చిన్మయి.  19 ఏళ్ళ వయసులో తనమీద లైంగికదాడికి పాల్పడిన ఆ బడాబాబు ఎవరో పేరు చెప్పండి చిన్మయి అని కామెంట్లు చేస్తున్నారు.