నిజాయితీకి మారుపేరు ఈ ఆటో డ్రైవర్.. - MicTv.in - Telugu News
mictv telugu

నిజాయితీకి మారుపేరు ఈ ఆటో డ్రైవర్..

October 9, 2018

పక్కనోళ్లు ఏమైపోతే నాకేంటి మనం బావుంటే చాలు అనుకునే నేటి సమాజంలో.. మంచి మనుషులు కూడా ఉన్నారని నిరుపించాడు ఓ ఆటో డ్రైవర్. తన ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ డబ్బులున్న బ్యాగును మర్చిపోయింది. ఇది గమనించిన డ్రైవర్ తిరిగి ఆ బ్యాగును ఆమెకు ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకుంది.Honest Auto Driver Returns 50,650 Cash Bag In Hyderabad Nampallyమాయదేవి(35) నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆటోరిక్షా ఎక్కి కొంత దూరం ప్రయాణించి దిగిపోయింది. ఈ సమయంలో ఆమె తన బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆటోలో బ్యాగు ఉన్నట్లు గమనించిన డ్రైవర్ షేక్ మహబూబ్ బ్యాగు తీసుకుని నాంపల్లి పోలీసులకు అప్పగించేందుకు వెళ్లగా.. అప్పటికే బాధితురాలు మాయాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ వెళ్లింది. దీంతో డ్రైవర్ మహబూబ్ బాధితురాలికి బ్యాగు అప్పగించాడు.కాగా ఆ బ్యాగులో రూ.50,650 నగదు ఉంది. ఆటోడ్రైవర్‌ నిజాయితీని మెచ్చుకున్న మాయదేవి తన బ్యాగులోని డబ్బుల్లోంచి రూ.10 వేలను షేక్ మహబూబ్‌కు బహుమతిగా ఇచ్చింది. నాంపల్లి పోలీసులు కూడా షేక్‌మహబూబ్‌‌ను ప్రశంసించారు.