నాకోపం వాళ్లిద్దరిపైనే… కౌశల్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకోపం వాళ్లిద్దరిపైనే… కౌశల్

October 8, 2018

‘వాళ్లిద్దరంటే నాకు చాలా కోపం.. నన్ను అనరాని మాటలు అన్నారు..’ ఈమాటలు అన్నది బిగ్‌బాస్ సీజన్2 విజేత కౌశల్. ఓ ప్రైవేట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ పై వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇద్దరు ఎవరో కాదు మానవతావాది బాబు గోగినేని, తేజస్వి అని వారి పేర్లు కూడా చెప్పాడు.

‘నేను భోజనం చేస్తుంటే తేజస్విని నన్ను సిగ్గులేకుండా తింటున్నావని అంది. చాలాసార్లు బ్యాడ్‌ వర్డ్స్‌ యూజ్‌ చేసింది. నేనంటే ఎందుకో ఓర్వలేకపోయేది. పగోడికన్నా హీనంగా చూసేది. నేను తనను ఏమీ అనేవాడిని కాదు. ఛానల్లో ప్రేక్షకులు చూసేది గంట ప్రోగ్రామ్ మాత్రమే. మిగతా 23 గంటలు హౌస్‌లో చాలా జరుగుతుంది. అదంతా చూపించారో లేదో తెలియదు. నేను కూడా ఇంకా ఆ ఎపిసోడ్లు చూడలేదు’ అని తెలిపాడు.I'm so angry with them ... Kaushalఇక బాబు గోగినేని చేసే ప్రతి టాస్క్‌ చీటింగే. కౌశల్‌ లెవెల్‌ ఏంటి? అని మాట్లాడారని చెప్పాడు. నాలుగో వారం వరకు తాను ఆయనతో చాలా క్లోజ్‌గానే ఉన్నానని… ఆయనంటే తనకు చాలా గౌరవం వుండేదని పేర్కొన్నాడు. ఒక అన్నలా భావించి తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నానని… అవన్నీ ఆయన బయటపెట్టడంతో  ఆయన మీద తనకున్న అభిమానం కాస్తా పోయిందని కౌశల్ వివరించాడు.