జేడీ ఇంట్లో చోరి… దొంగ దొరికాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

జేడీ ఇంట్లో చోరి… దొంగ దొరికాడు..

October 13, 2018

దొంగలు ఎప్పటికైనా పట్టుబడాల్సిందే. వాళ్ళు నాగలోకంలో దాక్కున్నా చట్టానికి చిక్కాల్సింది. గతేడాది సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నివాసంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ చోరీ కేసును బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు తేల్చారు. ఆయన ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసినతనే నిందితుడని తేల్చారు. అతణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు రూ. 20లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…JD Lakshmi Narayana roberry in the house ... thief is found ..బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సంస్కృతి ప్యాలెస్ అపార్ట్‌మెంట్స్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో నివాసం వుంటున్నారు. ఓ ఫంక్షన్ నిమిత్తం గతేడాది అగస్టులో సొంతూరు వెళ్లారు. అప్పుడే ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్నాళ్ళకు లాకర్లో పరిశీలించగా ఖరీదైన నగలతో ఉన్న బాక్స్ మాయమైంది. దీంతో గత నవంబర్ 17న లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిల బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇన్ని రోజులకు అసలు దొంగను పట్టుకున్నారు. ఇంట్లో పనిచేసిన వారిని, పనిమానేసిన వారిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణ వద్ద కొన్నాళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేసిన ఇక్కుర్తి రవికుమార్( 30) వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది.

అతడి కదలికలపై ఆరా తీయగా చోరీకి పాల్పడింది అతనే అని తేలింది. అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు.

చోరీ సొత్తులో కొంతభాగాన్ని తాకట్టు పెట్టినట్లు, మరికొంత భాగాన్ని వేరేవాళ్లకు ఇచ్చినట్లు గుర్తించి మొత్తం సొత్తును రికవరీ చేశారు.