బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద ! ఢిల్లీ నుంచి పిలుపు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద ! ఢిల్లీ నుంచి పిలుపు

October 8, 2018

పరిపూర్ణానంద బీజేపీలో చేరుతున్నారా? ఆయన తెలంగాణకు మరో యోగి ఆదిత్యనాథ్ కానున్నారా? ఇప్పుడీ  ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పరిపూర్ణానందకు ఆహ్వానం అందడం జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్టైంది. అక్టోబర్ 7న ఉదయం స్వామీజీ ఢిల్లీకి బయలుదేరి వెళతారని తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పరిపూర్ణానందకు బీజేపీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.Swamy Paripurna nanda is the BJP CM candidate... call from Delhiబీజేపీ అధిష్టానం పరిపూర్ణానందను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయనకు హైదరాబాద్ ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ఎన్నో రోజులుగా బీజేపీ పార్టీని నమ్ముకుని పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయలు ఏమైపోవాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎప్పుడైతే కత్తి మహేష్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పుడు ఎంటర్ అయిన పరిపూర్ణానంద స్వామి వార్తల్లో బాగా నానారు. పోలీసుల చేత ఆరు నెలలు నగర బహిష్కరణకు కూడా లోనయ్యారు.

అయితే పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. స్వామీజీపై నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో కిందటి నెల ఆయన హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచే పరిపూర్ణానంద రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న విషయం తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.