నగరం రోడ్లు రక్తసిక్తం… కుటుంబాల్లో తీరని విషాదం… - MicTv.in - Telugu News
mictv telugu

నగరం రోడ్లు రక్తసిక్తం… కుటుంబాల్లో తీరని విషాదం…

November 20, 2018

సోమవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్ నగర రోడ్లు రక్తసిక్తమయ్యాయి. రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రామాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. సికింద్రా బాద్ మెట్టుగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. తార్నాక నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా మెట్రో పిల్లర్ నం.1110 వద్ద పల్సర్ బైక్ అదుపు తప్పి కింద పడింది. మలుపు తిప్పుతుండగా అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముగ్గురు సూర్యాపేటకు చెందిన పృథ్వి, ఉదయ్, ఉదయ్ రెడ్డిలుగా గుర్తించారు పోలీసులు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరు ఉప్పల్‌లో నివాసం వుంటున్నారు. ముగ్గురిలో ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. ఒకరు ఉద్యోగం చేస్తున్నారు. వీరి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీళ్ళు రాత్రి పార్టీకి వెళ్లి మద్యం సేవించారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.Telugu news City roads bleeding ... the sad tragedy in families …మరో ప్రమాదం నెక్లెస్ రోడ్డులోని లుంబినీ పార్క్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను కొట్టేసి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకుపోయింది. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వాళ్లు మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే అతివేగమే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.