నిమజ్జనంలో విషాదం… బందోబస్తుకు వచ్చి... - MicTv.in - Telugu News
mictv telugu

నిమజ్జనంలో విషాదం… బందోబస్తుకు వచ్చి…

September 24, 2018

గణపతి నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.

గణేశ్ నవరాత్రి ఉత్సవాల బందోబస్తు కోసం వచ్చిన ఏఎస్‌ఐ గుండె పోటుతో దుర్మరణం చెందాడు. విషాదకర ఈ ఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నిమ్ర నాయక్(55) సిద్ధిపేట కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.The tragedy of ganesh nimajjan ... come to security…ఈనెల 11న గణేష్ ఉత్సవాల బందోబస్తు కోసం నిమ్ర నాయక్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి గోకుల్‌నగర్ వద్ద ఉన్న వినాయక మండపానికి వచ్చారు. డ్యూటీలో వున్న ఆయనకు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే నాంపల్లి కేర్ ఆసుపత్రికి  తరలించారు. చికిత్స పొందుతూ సుమారు 5 గంటల సమయంలో నిమ్రా నాయక్ మృతి చెందాడు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సొంతూరికి తరలించారు. నిమ్రానాయక్‌కు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. బందోబస్తు విధులకు వెళ్లి అకాలమరణం చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.