సీట్ల పంచాయతీ తేలుస్తారా.. బయటకు పొమ్మంటారా? - MicTv.in - Telugu News
mictv telugu

సీట్ల పంచాయతీ తేలుస్తారా.. బయటకు పొమ్మంటారా?

October 23, 2018

ముందస్తు ఎన్నికల్లో నేపథ్యంలో తెలంగాణలో విపక్ష పార్టీలతో ఏర్పడిన మహాకూటమి తీలుస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కద్దనే ఉద్దేశంతో ఏర్పడింది ఈ కూటమి. అయితే ఈ కూటమిలో నాయకుల మధ్య వైరాలు మొదలైనట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సమన్వలోపాలతో ఓ రెండు పార్టీలు కూటమి నుంచి బయట పడాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.Tjs, Cpi Out From Mahakutami For Congress Party Not Giving Expected Seats For Electionsఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకి 15 సీట్లు కావాలని టీజేఎస్, 8 సీట్లు కావాలని సీపీఐ పట్టుబట్టి కూర్చున్నాయి. అయితే అన్ని సీట్లు ఇవ్వలేమని.. టీజేఎస్‌కు 5 నుంచి 7, సీపీఐకి ఓ నాలుగు సీట్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ చెప్పేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తితో ఉన్న కోదండరామ్, చాడ వెంకటరెడ్డిలు మహా కూటమి నుంచి బయటకు రావాలని అనుకుంటున్నట్లు సమాచారం.  

అయితే మహా కూటమి ఏర్పటుకు ముందే కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్, సీపీఐ తమ డిమాండ్లను చెప్పింది. కానీ సీట్ల పంపకాలు, పొత్తులపై స్పష్టత ఇవ్వకముందే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ రేపటిలోగా స్పష్టత ఇవ్వకపోతే తాము ఒంటరిపోరుకు సిద్ధమేనని టీజేఎస్ పేర్కొంటుంది. అలాగే సీపీఐ కూడా 25 స్థనాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.