ఎమ్మెల్సీ రాములు నాయక్ సస్పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్సీ రాములు నాయక్ సస్పెన్షన్

October 15, 2018

ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై వేటు పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ రాములు నాయక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. అందుకే అతణ్ణి టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.TRS MLC Ramulu Naik Suspend From Trs Party.. Says Palla Rajeshwar Reddyరాములు నాయక్ టీఆర్‌ఎస్ నుంచి మెదక్ జిల్లా నారాయణ‌ఖేడ్ టిక్కెట్‌ను ఆశించారు. అయితే ఇప్పటికే ఆ టిక్కెటు ఖరారు చేయడంతో‌.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆదివారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి పోటీ చేయాలని రాములు నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ కోరినట్లు తెలుస్తోంది.