పద్మభూషణ్ వైరముత్తు.. లాక్కుని ముద్దులు పెడతాడు..   - MicTv.in - Telugu News
mictv telugu

పద్మభూషణ్ వైరముత్తు.. లాక్కుని ముద్దులు పెడతాడు..  

October 9, 2018

‘మీటూ’ ఉద్యమం మేకవన్నెపులుల అసలురంగు బయటపెడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు మోసిన ఎందరో సెలబ్రిటీల చీకటి కోణాలను రచ్చకీడుస్తోంది. తాజాగా ఆ జాబితాలో ఏడు పర్యాయాలు జాతీయ అవార్డు అందుకున్న తమిళ సినీపాటల రచయిత, పద్మభూషణ్ బిరుదాంకితుడు వైరముత్తు కూడా చేరాడు. అతడు పలురురు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ‘మీటూ’ ఆరోపిస్తున్నారు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా వైరముత్తు తెలుగువారికి కూడా పరిచయస్తుడే.

ytyఅతడు తనను లైంగికంగా వేధించాడని అతని వద్ద పనిచేసిన ఓ గాయని తెలిపింది. ఈమేరకు ఆమె వెల్లడించిన వివరాలను పాత్రికేయురాలు సంధ్యా మీనన్ బయటపెట్టింది. ‘నా 18 ఏట నుంచి వైరముత్తు దగ్గర పనిచేయడం ప్రారంభించాను. పరిశ్రమ ఆయనను ఒక గొప్పవ్యక్తిగా చూసేది. నేను కూడా ఎంతో గౌరవించాను. కానీ ఆయన అసలు రంగు తెలిశాక చాలా భయపడ్డాను. పైకి ఇంత గొప్పగా, గౌరవంగా కనిపించే అతడు  నాతో మాత్రం చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాటలను వివరించే సమయంలో నన్ను దగ్గరికి లాక్కుని కౌగిలించుకున్నాడు.. ముద్దులు పెట్టాడు. నాకు ఏం చేయాలో తోచక, భయంతో వణికిపోయాను. ఓకే సార్ అనేసి అతనింట్లోంచి  బయటపడ్డాను. అప్పటి నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని.. నలుగురితో కలిసి ఉండేందుకు ప్రయత్నించేదాన్ని అని గాయని తెలిపారు. కాగా, దీనిపై గాయని చిన్మయి స్పందిస్తూ.. వైరముత్తుకు రాజకీయ పలుకుబడి ఉంది కనుక ఎవరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడరని చెప్పారు.